- Advertisement -
కాన్పూర్: గ్రీన్ పార్క్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత్ జట్టు నాలుగు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మూడు ఓవర్లలో 51 పరుగులు చేసి టెస్టుల్లో భారత జట్టు రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్ జట్టు 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు చేసి హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మెహిడీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(30), శుభ్‌మన్ గిల్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలో రెండు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.
- Advertisement -