Monday, September 30, 2024

ప్రయాణికులకు ఆర్టీసి కానుక…బతుకమ్మ, దసరా స్పెషల్ !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దసరా పండుగకు శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ రాష్ట్ర రవాణా కార్పొరేషన్ యాజమాన్యం నిర్ణయించింది. సొంతూళ్లకు వెళ్లే వారు ఎంజిబిఎస్, జెబిఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘడ్, సంతోష్ నగర్, కెపిహెచ్ బి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసుల్లో వెళ్లొచ్చు. ఇక ఐటి కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులు నడుపనున్నారు. బస్సులు, సౌకర్యాలపై అధికారులతో సోమవారం ఎండి సజ్జనార్ సమావేశమయ్యారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సజ్జనార్, అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలకు, అలాగే ఏపి, కర్నాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున 9,10,11 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. రద్దీకి తగ్గట్టుగా దసరాకు 6000 ప్రత్యేక బస్సులు నడుపబోతున్నారు. స్పెషల్ సర్వీసులకు సంబంధించిన బస్సులు, టైమింగ్ తదితర సమాచారం కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News