Tuesday, October 1, 2024

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కు మోడీ ఫోన్

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ ద్వారా చర్చించారు.ఈమేరకు ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని, స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, బందీలందరినీ విడుదల చేయడం చాలా ముఖ్యమని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయానికి భారత్ కట్టుబడి ఉందని మోడీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లెబనాన్‌లో వరుసదాడులు సాగించి హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా సహా కీలక కమాండర్లను హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News