సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆస్పత్రిలో చేరారు. సోమవారం అర్థరాత్రి తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ముందస్తు చికిత్స భాగంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో 73 ఏళ్ల రజినీకాంత్ కు ఎలక్టీవ్ ప్రొసీజర్ నిర్వహించనున్నట్లు సమాచారం. గుండెకు సంబంధించిన టెస్టులు, చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రజనీకాంత్ కుటుంబం నుంచి కానీ, ఆస్పత్రి నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
కాగా 2020లో,రజినీకాంత్ అధిక రక్తపోటుతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తన రాజకీయ పార్టీ ప్రారంభించడానికి రెండు రోజుల ముందు ఆస్పత్రిలో చేరిన ఆయన డిశ్చార్జి అయిన తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లోకి రానని ప్రకటించారు. రజనీకాంత్ మూడు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం చెన్నైలోని తన నివాసానికి తిరిగి వెళ్లిపోయారు.