- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న సమయంలో కవితకు గైనిక్ సమస్యలకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో రెండు సార్లు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స అందించిన సంగతి తెలిసిందే.
- Advertisement -