Tuesday, October 1, 2024

ఇది ఎలా మనీ లాండరింగ్ కేసు?

- Advertisement -
- Advertisement -

ఇడి కేసు దాఖలును ప్రశ్నించిన సిద్ధరామయ్య
ముడా అంశానికి పిఎంఎల్‌ఎ నిబంధనలు వర్తించవని వ్యాఖ్య

బెంగళూరు : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తనపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కేసును నమోదు చేయడాన్ని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రశ్నించారు. ముడా అంశానికి ఆ చట్టం నిబంధనలు వర్తించవని సిఎం స్పష్టం చేశారు. సిద్ధరామయ్య బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, ‘ఇది ఏ విధంగా మనీ లాండరింగ్ కేసో నాకు తెలియదు. మీరు కూడా అదే విధంగా భావిస్తుండవచ్చు. నా ఉద్దేశం ప్రకారం పరిహారంగా స్థలాలు ఇచ్చినందున ఇది మనీ లాండరింగ్ కేసు కిందకు రాదు. అందువల్ల ఇది ఎలా మనీ లాండరింగ్ కేసు?’ అని అన్నారు.

మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) ముఖ్యమంత్రి భార్యకు 16 స్థలాలు కేటాయించడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణకు సంబంధించి ఆయనపై పోలీసుల ఎఫ్‌ఐఆర్‌తో సమానమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ఇసిఐఆర్)ను ఇడి సోమవారం నమోదు చేసిన విషయం విదితమే. ఇడి ఇసిఐఆర్‌లో ముఖ్యమంత్రిపైన, ఇతరులపైన పిఎంఎల్‌ఎలోని సంబంధిత నిబంధనలను ఉటంకించింది. ముడా కేసుపై తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘నేను అంతరాత్మ ప్రబోధం ప్రకారం పని చేస్తాను. కనుక నేను రాజీనామా చేయవలసిన అవసరం లేదు’ అని సిద్ధరామయ్య చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News