Wednesday, October 2, 2024

కశ్మీరులో 65.48 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

ప్రశాంతంగా ముగిసిన 3వ విడత ఎన్ని పోలింగ్

జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్‌లో 65.48 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలియచేసింది. శీతాకాలం రాజధాని జమ్మూతోసహా ఏడు జిల్లాల వ్యాప్తంగా 40 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. 2019లో రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్‌తోపాటు, పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులతోసహా 415 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 39.18 లక్షలకు పైగా ఓటర్లు నిర్ణయించనున్నారు.

అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) వెంబడి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాలతోసహా అన్ని నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించలేదని ఇసి తెలిపింది. ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 13 శాతం వరకు పోలింగ్ నమోదుకాగా, తర్వాతి స్థానాలలో వరుసగా సంబా(72.41 శాతం), కథువా(70.53 శాతం), జమ్మూ(66.79 శాతం), బండిపొరా(63.33 శాతం), కుప్వారా(62.76 శాతం), బారాముల్లా(55.73 శాతం) జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గాలలో జమ్మూ జిల్లాలోని ఛంబాలో అత్యధికంగా 77.35 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా ఉగ్రవాద, వేర్పాటువాద ప్రాబల్య సోపోర్ నియోజకవర్గంలో 41.44 శాతం నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News