Wednesday, October 2, 2024

బిసి డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త ఉద్యమం : ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశ పెట్టి చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, – దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని, స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం సీట్లు కేటాయించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బిసి డిమాండ్‌ల సాధన కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడ్తామని హెచ్చరించారు. మంగళవారం బిసి భవన్‌లో బర్క కృష్ణ అధ్యక్షతన బిసి సంక్షేమ సంఘం ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘమేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని, చట్ట సభల్లో రిజర్వేషన్‌ల కోసం గత 30 సం.రాలుగా బిసిలు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

దేశంలో బిసి లను బిద్చగాళ్ళను చేశారని విమర్శించారు. బిసిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ గొర్రెలు, బరైలు, ‘పందులు, పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బిసిలను శాశ్వత బిచ్చగాళ్ళను చేస్తున్నారని ఆరోపించారు. కులగణన చేసి బిసిల జనాభా కూడా లెక్కించడానికి ఈ అగ్రకుల ప్రభుత్వాలకు మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. బిసిలకు కేంద్రస్థాయిలో ఒక్క పథకం కూడా లేదని, కాలేజీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఫీజులు కూడా మంజూరు చేయడం లేదని విమర్శించారు. 56 శాతం జనాభా కలిగిన బిసిలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారన్నారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారని మనదేశంలో పీడిత కులాలను ఇంకా అణచి వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో బిసి నాయకులు గుజ్జ కృష్ణ, ఇతర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News