Wednesday, October 2, 2024

మన పార్టీ బడుగుల పక్షపాతి.. బద్నాం కావొద్దు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే అవకాశం ఇవ్వొద్దు బుల్డోజర్ సంస్కృతికి బిజెపి పేటెంట్
సమిష్టి నిర్ణయాలు ఉండాలి విపక్షాలు రాద్ధాంతం చేస్తుంటే మంత్రుల మౌనమెందుకు?
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సంయమనం పాటించాలని అగ్రనేతల సూచన మంత్రివర్గ విస్తరణ,
నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఎఐసిసి చీఫ్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో సిఎం చర్చ

కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్‌కు అధిష్ఠానం హితవు

మనతెలంగాణ/హైదరాబాద్:మూసీనది, హిమాయత్‌సాగర్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జి ల్లాల పరిధిలోని చెరువులు, కుంటల పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఇళ్లు, ఇతర నిర్మాణాల కూల్చివేతల అంశం వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డిని ఆరా తీసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను పరామర్శించేందుకు సోమవారంరాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గేతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చేపట్టిన కూల్చివేతల అంశంపై వారు ఆరా తీసిన ట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి, వారిని దూరం చేసుకునే పనులను ఎట్టి పరిస్థితులలో చేయరాదని వారు సూచించినట్టు తెలిసింది.

బుల్డోజర్ సంస్కృతికి బీజేపీ పేటెంట్ అని యూపిలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఉటంకించినట్టు తెలిసింది. అలాంటి చెడ్డ పేరు మనం తెచ్చుకోవద్దని వారు సూచించినట్టు తెలిసింది. ఏ పని చే సినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఆ చితూచి నడుచుకోవాలని, ఏ చిన్న తప్పిదం జరిగి నా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఇతర పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వద్దని వారు సూ చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పా ర్టీ కావడంతో పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చిన్న తప్పు జరిగినా దేశవ్యాప్తంగా అప్రతిష్టపాలు చేయడానికి కాచుకొని కూర్చుంటారనే విషయా న్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకు న్న అది మంత్రివర్గం తీసుకున్న సమిష్టి నిర్ణయం గా ఉండాలి తప్ప అదేదో సీఎం సొంత నిర్ణయం గా ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుంటే ఇదేదో తమకు సంబంధం లే ని విషయం లా మంత్రులు ఎందుకు మౌనంగా ఉండటం తగదని అధిష్ఠాన పెద్దలు తప్పుపట్టిన ట్టు తెలిసింది.

రాబోయే స్థానిక ఎన్నికలు, జిహెచ్‌ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంయమనంతో వ్యవహరించాలని కూడా సూచించినట్టు తెలిసింది. ఇలా ఉండగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపై కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చెందిన ఆశావాహులు దసరాకు విస్తరణ ఉంటుందని ఆశతో ఎదురు చూస్తున్నారని, త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించేందుకు కష్టపడుతారని సీఎం కోరినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News