గద్దెనెక్కిస్తే పేదల ఇళ్లపై
గద్దల్లా పడ్డారు బాధిత
మహిళలందరూ చాకలి
ఐలమ్మలు, రాణిరుద్రమ్మలు
కావాలి మూసీ బాధితులకు
అండగా ఉంటాం : కెటిఆర్
రోడ్డున పడుతున్నామని
నిర్వాసితుల ఆవేదన
మనతెలంగాణ/అంబర్‌పేట: మూసీ ప్రాజెక్ట్ బాధితులకు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అండగా ఉంటామని, ఏ ఒక్కరూ ధైర్యం కో ల్పోకుండా ఐక్యతతో బుల్డోజర్లను అడ్డుకోవాలని బాధితులకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక తులసి రామ్‌నగర్ (లం క) బస్తీలో కేటీఆర్ పర్యటించారు మూసీ ప్రాజెక్ట్ బాధితులకు పరామర్శించి కొంతమంది మహిళలు కేటీఆర్‌తో మాట్లాడారు .. మేము నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి కష్టం చేసి తమ సొంత డబ్బులతో 50, 60 గజాలు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్నామని, అలాంటి ఇల్లు కూల్చడంతో మా పిల్లలు మేము రో డ్డున పడతామన్నారు.
20 కిలోమీటర్ల దూ రంలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తే మేము ఎలా వెళ్లాలి సార్ అంటూ కేటీఆర్ తో తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేద ప్రజలు రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే గద్దలాగా పేద ప్రజలను ఇల్లు కూల్చే పనిపెట్టుకున్నారని ఆయన విమర్శించారు. అడ్డిమారు గుడ్డి దెబ్బతో సీఎం అయిన రేవంత్‌కి గ్రేటర్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణలో పెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా పండుగ జరుపుకోకుండా బా ధితులు రాత్రిపూట నిద్ర లేకుండా భయభ్రాంతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గురి చేస్తుందన్నారు. బాధిత మహిళలందరూ ఝాన్సీ రుద్రమదేవి, చాకలి ఐలమ్మ లాం టి వీరమణుల స్ఫూర్తితో చీపుర్లు, రోకల్లతో పట్టుకొని కూల్చడానికి వచ్చిన వారికి బుద్ధి చెప్పి బుల్డోజర్లను తరిమికొట్టాలన్నారు.