Wednesday, October 2, 2024

మూసీ ప్రక్షాళన షురూ

- Advertisement -
- Advertisement -

మలక్‌పేటలో నది రివర్‌బెడ్‌లో
ఉన్న నిర్మాణాలు నేలమట్టం
పలుచోట్ల అడ్డగింతలు, మరికొన్ని
చోట్ల స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ
ఎంఐఎం ఎంఎల్‌ఎ బలాలకు
వ్యతిరేకంగా నినాదాలు
నష్టపోతున్నాం..ఆదుకోవాలని
అధికారులకు బాధితుల వేడుకోలు
కోర్టు ఆదేశాలతో గచ్చిబౌలిలో
స్వయంగా నిథమ్ కూల్చివేతలు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: మూసీ నది వెంట ఇండ్ల కూల్చివేతలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానికులకు, పోలీసులకు మధ్య పలుచోట్ల వాగ్వాదం చోటుచేసుకోగా, రెవెన్యూ అధికారుల ఆదేశాలమేకు జరుగుతున్న కూల్చివేతలను అడ్డుకునే ప్ర యత్నం బాధితులు చేశారు. ఈ సందర్భం లో కాస్తంత ఉద్రిక్తత వాతావరణం మలక్‌పేటలోని మూసానగర్‌లో చోటుచేసుకుంది. అయితే, పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే బలాల అక్కడకు రాకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా బాధితులు పెద్దఎత్తున నినదించారు. పలువురు బాధితులు నేరుగాస్థానిక ఎమ్మెల్యే బయటకు రావాలని డిమాండ్ చే శారు. ఇదిలా ఉంటే తమకు తీరని అన్యా యం జరుగుతుందని, తమకు న్యాయం చే యాలని పలువురు బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

మలక్‌పేట్ నియోజకవర్గంలోని మూసానగర్, శంకర్‌నగర్, వి నాయక్‌నగర్‌లలో కూల్చివేతలు జరిగాయి. చాలా మంది ఇండ్ల యజమానులు సంఘటనా స్థలానికి రావడానికి ఆసక్తిని చూపడలేదని వారి ఇండ్లలో అద్దెకు ఉంటున్నవారు వెల్లడిస్తున్నారు. దీంతో మూసీనది వెంట కూల్చివేతల్లో కొంత గందరగోళం నెలకొన్నది. మరోవైపు శంకర్‌నగర్‌లో మూసీ రివ ర్ బెడ్‌లోని ఇళ్లను స్వచ్ఛందంగా పలువురు ఖాళీ చేశారు. దీంతో అధికారులు కూలీలను పెట్టి ఆ ఇళ్లను నేలమట్టం చేశారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి డబుల్‌బెడ్రూం ఇళ్లకు తరలించారు.

ఉద్రిక్తత..

మూసీనది వెంట కూల్చివేతల నేపథ్యంలో మూసానగర్‌లో కొంత ఉద్రిక్తత నెలకొన్నది. కూల్చివేతలకు సిద్ధమవుతోన్న సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం బాధితులు చేస్తుండగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో.. పోలీసులకు, బాధితులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తమకు న్యాయం జరిగే వరకు కూల్చివేతలు చేపట్టరాదంటూ బాధితులు కూల్చివేసేందుకు వచ్చిన సిబ్బందిని అడ్డుకున్నారు. అయితే, జెసిబిలు, బుల్డోజర్లను తీసుకొస్తే.. బాధితులు పెద్ద ఎత్తున అడ్డుకుంటునారనీ, అదికాస్త కూల్చివేతలకు వ్యతిరేకంగా జనం పోగవుతున్నారని గ్రహించిన రెవెన్యూ అధికారులు జెసిబిలు, బుల్డోజర్లను ప్రక్కనపెట్టి కేవలం సిబ్బందితోనే కూల్చవేతలను చేపడుతున్నారు. దీంతో వారిని బాధితులు అడ్డుకునేందుకు యత్నించారు.

సిబ్బందిని బాధితులు అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను సముదా యించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసు లకు, బాధితులకు మధ్య వాగ్వివాదం పెద్ద ఎత్తున జరిగి కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. అనంతరం పోలీసులు భారీగా అక్కడకు రావడంతో సద్దుమనిగింది. అనంతరం మలక్‌పేట్ ఎమ్మెల్యే బల్లాలకు వ్యతిరేకంగా బాధితులు నినదించారు. ఈ పరిస్థితుల్లో మాకు అం డగా ఎమ్మెల్యే ఉండరా..? అంటూ ఆయనకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడకు వచ్చి బాధితుల పక్షాన నిలబడతామంటూ ప్రకటించారు.

నష్టపోతున్నాం.. న్యాయం చేయండి

అధికారులు చెప్పే మాటలకు, బాధితులు వెల్లడిస్తున్న ఆవేదనలకు పొంతన లేకుండా పోతోంది. మూసీనది బాధితుల్లో కొంత గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుంది. మీరంతట మీరు ఖాళీ చేసి డబుల్ బెడ్రూంలు తీసుకునేందుకు అంగీకరిస్తే.. మీకు ఈ డబుల్ బెడ్రూం ఉంటుంది, సిబ్బంది సహాకారం. వస్తువుల షిప్టింగ్‌కు వాహనాలు అందుబాటులో ఉంటాయి. లేకుంటే మీ ఇంటిని కూల్చివేయడం ఖాయం, డబుల్ బెడ్రూం ఇల్లును కేటాయించం.. రెండు విధాలుగా మీరు నష్టపోతారంటూ అధికారులు తేల్చిచెప్పుతున్నట్టు బాధితులు వెల్లడిస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తాము ఇక్కడ ఇల్లును ఖాళీ చేసి డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్తున్నామని కొందరు బాధితులు స్పష్టం చేస్తున్నారు.

కెటిఆర్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ వర్గాలు

మూసీనది బాధితులకు సంఘీభావం తెలిపేందుకు అంబర్‌పేట్ నియోజకవర్గంకు వచ్చిన సందర్భంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కెటి రామారావును స్థానిక కాంగ్రెస్ వర్గాలు అడ్డుకున్నాయి. ఆయన వాహనంపైకి కొందరు ఎక్కి తమ నిరసనను వ్యక్తంచేశారు. కెటిఆర్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ వర్గాలను తొలగించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేయలేదని పగబట్టి పేదోళ్ళ ఇండ్లను సిఎం రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నారనీ, హైదరాబాద్ ప్రజలకు దసరా పండుగ ఆనందం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.

700 నివాసాలను ఖాళీ చేయించాల్సి ఉంది

మొత్తం అన్ని నివాసాలను ఖాళీ చేయించడానికి మరో వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశముందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇక్కడ 148 ఇండ్లను ఖాళీచేసి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించినట్టు అధికారులు వెల్లడించారు. జియాగూడ 15, పిల్లిగుడిసెలు 136, ప్రతాపసింగారం 16, నార్సింగిలో 7 కుటుంబాలకు పునరావాసం కలిపించినట్టు తెలిపారు. 26 నుండి మార్కింగ్, ఇళ్ళను ఖాళీ చేయించడం మొదలైందనీ,- ఖాళీ చేయించిన ఇళ్లను కూల్చివేతలు జరుగుతున్నాయనీ, అవికూడా వారి అనుమతితోనే చేస్తున్నట్టు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో మూసీ నిర్వాసితుల్లో 23 కుటుంబాలు తరలించామనీ, మేడ్చల్ జిల్లా పరిధిలో 33 కుటుంబాల తరలించినట్టు, మూసి రివర్ బెడ్ లో ఖాళీచేసిన ఇండ్లు కూల్చి వేస్తున్నట్టు తెలిపారు. చాదర్ ఘాట్‌లోని మూసానగర్, రసూల్ పురాలో ఖాళీ చేసిన ఆర్‌బీఎక్స్ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను కూల్చివేతలు చేపట్టినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.

చెరువులో నిర్మాణం కూల్చివేత

గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం ఆండ్ హస్పిటల్ మేనేజ్‌మెంట్ (నిథిమ్) లో చెరువును ఆక్రమించిన చేపట్టిన నిర్మాణాన్ని మంగళవారం నిథిమ్ యాజమాన్యం కూల్చివేసింది. చెరువు బఫర్ జోన్‌లో అక్రమ కట్టడమని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో స్వయంగా కూల్చివేతలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News