Wednesday, October 2, 2024

మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ, రాహుల్ నివాళి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓఎం బిర్లా, ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి నివాళులర్పించారు.

సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన బాపు జీవితం, ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని ఎక్స్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతిపితగా కీర్తించబడిన గాంధీ, సత్యం, అహింస సూత్రాలను దృఢంగా అనుసరించారని, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలకు తరతరాలు స్ఫూర్తినిస్తారని అన్నారు. అలాగే ఈ రోజున జన్మించిన భారతదేశ రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కూడా ప్రధాని మోదీ నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News