Saturday, December 21, 2024

పూణెలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పూణెలో బుధవారం తెల్లవారుజామున హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణె జిల్లాలోని బవధాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. విషాద సంఘటన జరిగిన వెంటనే రెండు అంబులెన్స్‌లు, నాలుగు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో పైలట్, ఇద్దరు ఇంజినీర్లు మృతి చెందినట్లు తెలిపారు. అయితే, హెలికాప్టర్ లో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పింప్రి చించ్వాడ్ పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News