Sunday, November 24, 2024

సమిష్టి కృషి వల్లే స్వచ్ఛ భారత్‌ సాధ్యం: ప్రధాని మోదీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సమిష్టి కృషి వల్లే స్వచ్ఛ భారత్‌ సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో అమృత్ 2.0 కార్యక్రమం, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోబర్ధన్ యోజన వంటి పలు కీలక కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ మిషన్ అనేది ప్రజల ఉద్యమంగా మారిందన్నారు. గాంధీజీ స్వచ్ఛభారత్ కలను సాకారం చేస్తామని చెప్పారు. మిషన్ అమృత్ కింద దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నీరు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు తోడ్పాటునందించేందుకు రూ.10,000 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సేవా పక్వాడా కార్యక్రమంలో 28 కోట్ల మంది పాల్గొన్నారుని తెలిపారు. స్వచ్చభారత్‌కు కృషిచేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News