సంగారెడ్డి: హైడ్రా నిబంధనలపై అఖిలపక్ష భేటీ పెట్టాలని ఎంపి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించాలని, హైడ్రాపై అవగాహన లేకనే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, బిఆర్‌ఎస్ వాళ్లు బుల్డోజర్లతో కూల్చిన విషయం మరిచారా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా సంగారెడ్డిని స్వచ్ఛ సంగారెడ్డి చేస్తామని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తుందని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రజలను, మహిళలు ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకపోవడంతో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. నెలలో ఒక్క రోజైన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ పోస్టులపై దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అసభ్యకర పోస్టులు పెట్టిన వారెవరైనా శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు.
అసభ్యకరమైన పోస్టులు… వారికి శిక్ష పడేలా చేస్తాం: రఘునందన్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -