Saturday, December 21, 2024

2050 నాటికి మూడు ప్రపంచ అగ్ర రాజ్యాలు

- Advertisement -
- Advertisement -

వాటిలో భారత్ ఒకటి
‘సంక్లిష్టంగా ప్రపంచ వ్యవస్థ’
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్

లండన్ : 2050 నాటికి భారత్, యునైటెడ్ స్టేట్స్ (యుఎస్), చైనా ఆధిపత్యం వహించే అగ్ర రాజ్యాలుగా అవతరిస్తాయని, దీనితో ‘సంక్లిష్ట ప్రపంచ వ్యవస్థ’ నెలకొంటుందని, ఆ వ్యవస్థలో వ్యవహరించేందుకు ప్రపంచ నేతలు సిద్ధం కావాలని యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సూచించారు. 71 ఏళ్ల బ్లెయిర్ ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’కు ఇంటర్వూ ఇస్తూ, ఆ మూడు దేశాలతో రూపుదిద్దుకునే బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు దేశాలు అలవాటు పడవలసిన అవసరం ఉంటుందని అన్నారు. ‘ప్రపంచంలో మీ దేశం ఏ వైపు ఉండాలో మీరు నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అది బహుళ ధ్రువ ప్రపంచం కాబోతున్నది’ అని ఆయన సూచించారు. ‘ఈ శతాబ్దం మధ్యభాగానికి మూడు అగ్ర రాజ్యాలు & అమెరికా, చైనా, బహుశా భారత్ ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు.

తాను పదవిలో ఉన్న సమయంలో యుఎస్ ఆధిపత్యం ఉన్న అగ్ర రాజ్యం అని, అప్పటి కన్నా ఇప్పుడు ప్రపంచ వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారిందని 1997 నుంచి 2007 వరకు బ్రిటిష్ ప్రధానిగా ఉన్న బ్లెయిర్ చెప్పారు. చైనా, భారత్ ఉత్థానం భౌగోళిక రాజకీయాలను తిరిగి రూపుదిద్దుతున్నాయని, కూటములను, దౌత్యపరమైన వ్యూహాలని తిరిగి మదింపు వేయవలసిన అవసరం కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. ఒకింత సమాన స్థాయిలో ఆ మూడు అగ్ర రాజ్యాలతో మీరు చర్చలు జరపడానికి వీలుగా బలమైన కూటములను నిర్మించుకోవలసి ఉంటుంది’ అని బ్లెయిర్ అన్నారు, మధ్య ప్రాచ్యంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్, హెజ్బొల్లా తీవ్రవాదుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, విస్తృత సంఘర్షణ ముప్పు గురించి కూడా బ్లెయిర్ మాట్లాడారు. ‘అది చాఆ ప్రమాదకర పరిస్థితి. మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ప్రస్తుత సంఘర్షణలే అందుకు కారణం’ అని బ్లెయిర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి నెలకొనడానికి రెండు దేశాల పరిష్కార సూత్రానికి తాను మద్దతు ఇస్తున్నానని బ్లెయిర్ పునరుద్ఘాటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News