ఉత్తర ప్రదేశ్ బరైలీ జిల్లాలో ఒక గ్రామంలో ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో బుధవారంపేలుడు సంభవించగా కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు. మరి ముగ్గురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. సిరౌలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సంభవించిన విస్ఫోటం వల్ల ఆ పక్కన గల కొన్ని భవనాలు కూడా దెబ్బ తిన్నాయని వారు తెలిపారు. ఫ్యాక్టరీ నిర్వాహకుని లైసెన్స్‌ను తాము పరీక్షిస్తున్నామని పోలీసులు చెప్పారు.
‘బరైలీ జిల్లా సిరౌలీ ప్రాంతంలోని ఒక బాణాసంచా తయారీ యూనిట్‌లో విస్ఫోటంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కనీసం ముగ్గురు గాయపడ్డారు’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ (బరైలీ రేంజ్) రాకేశ్ సింగ్ ‘పిటిఐ’తో చెప్పారు. ‘ఆ పేలుడుకు ఆ పక్కనే ఉన్న మూడు నాలుగు భవనాలూ దెబ్బ తిన్నాయి. బాణాసంచా యూనిట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తిని నసీర్‌గా గుర్తించడమైంది. అతని వద్ద లైసెన్స్ ఉంది. దాని వివరాలను పరిశీలిస్తున్నాం’ అని సింగ్ తెలియజేశారు.