Sunday, December 22, 2024

‘దేవర’ సక్సెస్‌ ఈవెంట్ నిర్వహించలేకపోతున్నాం.. క్షమాపణలు చెప్పిన నాగవంశీ

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. భాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో దేవర మూవీ టీమ్ సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఎలాంటి సక్సెస్ వేడుక నిర్వహించడం లేదని ప్రముఖ నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు.

“దేవర సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. భారీ విజయోత్సవ సభను నిర్వహించాలనుకున్నప్పటికీ అనుమతులు లభించలేదు. ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరుతున్నాం” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా రిలీజ్ కు ముందు కూడా చివరి నిమిషంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News