Sunday, December 22, 2024

‘హిట్ 3’ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ…

- Advertisement -
- Advertisement -

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’లో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది.

ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో శ్రీనిధి శెట్టి షూట్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం, టీమ్ లీడ్ పెయిర్- నాని, శ్రీనిధి శెట్టికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. మే 1, 2025న వేసవిలో ‘హిట్ 3’ థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News