Sunday, November 24, 2024

కాళేశ్వరం ప్రాజెక్టు కళ్లముందే కుప్పకూలింది:ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

లక్షకోట్ల ప్రజాధనం వ్యయం చేసి గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కళ్లముందే కుప్పకూలిందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. గురువారం సెస్ లో డా.మర్రిచెన్నారెడ్డి ట్రస్ట్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమమావేశంలో లక్ష్మణ్‌తోపాటు చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ట్రస్ట్ కార్యదర్శి మర్రి శషిధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టారని ఎన్ని వేల ఎకరాలకు నీరిచ్చారో చెప్పాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఇటు వంటి చర్యలను చూస్తూ మేధావులు నిపుణులు మౌనంగా ఉంటే దేశానికి కీడు చేసిన వారవుతారని హెచ్చరించారు.పాలకులకు ప్రాజెక్టులు ఆదాయ వనరులుగా మారరాదన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందిచే వాటర్ షెడ్ పథకాలపై దృష్టి పెట్టాలన్నారు. మాజీ ఈఎన్సీ హనుమంతరరావు చూపెట్టిన వర్షపు నీటిని సద్విని యోగం చేసుకునే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

ఢిల్లీలో కూడా ఇటు వంటి సమావేశాలు ఏర్పాటు చేయిస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు. చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి మాడ్లాడుతూ నీటిపారుదల రంగం నిపుణులు హనుమంత రావు పెద్ద ప్రాజెక్టుల వల్ల ఆశించిన ఫలితాలు రావని చెప్పారన్నారు.ఆయన ఇచ్చిన స్పూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించికపోయినా , రాజస్థాన్ ప్రభుత్వం గుర్తించి అక్కడ అమలు చేసి మంచి ఫలితాలు సాధించిందన్నారు.ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలే మంచి ఫలితాలు ఇస్తాయని హణుమంతరావు నిరూపించారు.. రౌండ్‌టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్ దొంతు నరసింహారెడ్డి, ఐఒఎల్ మాజీ జిఎం ఎస్‌ఎస్ ప్రసాద్ , పర్యావరణ రంగం నిపుణులు పురుషోత్తమ్ రెడ్డి, రాజస్తాన్ రిటైర్డ్ ఎస్‌ఇ దీపక్ శ్రీవాత్సవ , ఇస్రో డిప్యూటి డైరెక్టర్ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News