Saturday, October 5, 2024

సికిందరాబాద్ గోవా ల మధ్య ఈనెల 6 నుంచి బై వీక్లీ ట్రైన్

- Advertisement -
- Advertisement -

పర్యాటక ప్రాంతం గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. కొత్తగా సికింద్రాబాద్ – వాస్కోడిగామా – సికింద్రాబాద్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 6న రైలును ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్ – వాస్కోడగామా (07039) వన్ వే స్పెషల్ రైలును ఈ నెల 6న ఉదయం 11.45 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

సికింద్రాబాద్ – వాస్కోడిగామా (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాలు అందుబాటులో ఉంటుందని.. వాస్కోడిగామా – సికింద్రాబాద్ (17040) రైలు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉదయం 10. 25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.45 గంటలకు వాస్కోడిగామాకు చేరుకుంటుందని పేర్కొంది. రైలు కాచిగూడ, షాదర్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్‌పేట్, కొప్పల్, గదడ్, హుబ్బలి, దర్వాడ్, లోండా, మడగాన్ స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుందని వివరించింది. రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పింది.

ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుండగా ఇందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే కావడం గమనార్హం. నేరుగా గోవాకు రైలులో వెళ్లే సదుపాయం లేక సొంత వాహనాలు, ప్రత్యామ్నయ మార్గాల్లో అక్కడికి చేరకుంటున్నారు. ప్రస్తుతం వారానికి ఒక రైలు 10 బోగీలతో సికిందరాబాద్ నుంచి బయలు దేరి గుంతకల్ చేరుకుని అక్కడ తిరిపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కూడా కాచిగూడయ లహంక మధ్య వారానికి నాలుగు రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్‌లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. బై వీక్లీ ట్రైన్‌తో ఆ కష్టాలకు చెక్ పడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News