పడవలో 278 మంది ప్రయాణికులు
గోమా : తూర్పు కాంగోలోని కివు సరస్సులో 278 మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ఒక పడవ గురువారం మునిగిపోగా కనీసం 78 మంది దుర్మరణం చెందారని స్థానిక గవర్నర్ వెల్లడించారు. మృతుల సంఖ్య తాత్కాలికమేనని, అది పెరిగే అవకాశం ఉందని దక్షిణ కివి ప్రావిన్స్ గవర్నర్ జీన్ జాక్విస్ పురుసి ‘ఎపి’ వార్తా సంస్థకు తెలియజేశారు. పరిమితికి మించిన ప్రయాణికులతో ఉన్న పడవ కితుకు రేవుకు కొన్ని మీటర్ల దూరంలో డాక్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పడవ దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుంచి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు ప్రయాణిస్తున్నది. రక్షణ కార్యకర్తలు కనీసం 50 మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీయడం తాము చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 10 మంది ప్రాణాలతో బయట పడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 50 మందిని రక్షించారని స్థానిక అధికారులు ఆ తరువాత తెలియజేశారు. అన్వేషణ, రక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
తూర్పు కాంగోలో పడవ మునిగి 78 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -