- Advertisement -
అప్పుల బాధతో ఓకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సురేష్ ఆయన భార్య హేమలత వారి కొడుకు హరీష్ లు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే హరీష్ గత కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులపాలు అయ్యాడు. దీంతో వాటిని తీర్చేందుకు పొలాన్ని అమ్మేసిన కుటుంబం.. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురైంది.
ఈ క్రమంలో తండ్రి సురేష్, తల్లి హేమలతతో పాటు కొడుకు హరీష్ ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
- Advertisement -