Thursday, December 19, 2024

వడోదర, రాజ్ కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్ లోని వడోదర, రాజ్ కోట్ విమానాశ్రయాలకు తాజాగా బాంబు బెదిరింపులు అందాయి. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్) ఈ-మెయిల్ కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బాంబుస్క్వాడ్స్, ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ ఎటువంటి అనుమానస్పద  వస్తువులు లభించలేదు. ఈ బెదిరింపులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News