Sunday, October 6, 2024

మావోయిస్టు అగ్రనేత కేశవరావు సురక్షితమేనా?

- Advertisement -
- Advertisement -

అభూజ్‌మాడ్‌పై పట్టు సాధిస్తున్న భద్రత బలగాలు, బస్తర్‌లో మావోయిస్టులకు కొలుకోలేని దెబ్బ, ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి
ఇప్పటివరకు 15 మంది నక్సల్స్ గుర్తింపు, మృతుల్లో విజయవాడకు చెందిన నాగరాజు, భారీయెత్తున ఆయుధాల స్వాధీనం, ఈ ఏడాది చత్తీస్‌గఢ్‌లో అతి భారీ ఎన్‌కౌంటర్ ఇదే

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: మావోయిస్టులకు కొలుకోని దెబ్బతగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు రక్షణకవచం అయిన అభూజ్‌మాడ్ (సెఫ్ జోన్) పై పోలీసులు పై చేయి సాధించారు.శత్రుదుర్బేధ్యంగా ఇన్నాళ్ళు తమకు సురక్షిత స్దావరంగా మలుచుకున్న మావోయిస్టుల అబుజ్ మడ్ పై భద్రతా బలగాలు క్రమేపి వశపర్చుకోవడం ప్రారంభించాయి శుక్రవారం బస్తర్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 31మంది మరణించడం మావోయిస్టులను చావు దెబ్బతీయగా మరోవైపు పోలీసు బలగాలు అభూజ్‌మాడ్‌ను తమ ఆదీనంలోకి తీసుకునే ప్రయత్నాలు ఫలించినట్లు అవుతుంది..

దంతెవాడ – నారాయణపూర్ సరిహద్దు లో బస్తర్ డివిజన్‌లో నెందుర్-తుల్తులిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు బస్తర్ డిఐజి సుందర్ రాజ్‌అధికారికంగా వెల్లడించారు.ఈ ఎన్‌కౌంటర్‌లో, 18 మంది పురుషులు 13 మంది మహిళలతో సహా 31 మంది సాయుధ యూనిఫాం ధరించిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు అంతేగాకుండా పెద్ద సంఖ్యలో నక్సలైట్లు గాయపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే శనివారం సాయంత్రం వరకు మరణించినవ రిలో 15మందిని గుర్తించారు వారిలో డివిసి, ,డికెఎస్ జెడ్ సి 6 కి చెందిన అనేక కేడర్ లతో పాటు, రూ. 8 లక్షల రివార్డ్‌తో కూడిన డిబిసిఎం రెండు క్యాడర్‌లు పి ఎల్ జి ఏ కంపెనీ 6కి చెందిన 9 క్యాడర్‌లు ఉన్నట్లుగుర్తించారు. మిగిలిన వారి గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది.

మృతుల్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ , చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎర్మగూడకు చెందిన నీతి ఆలియాస్ ఊర్మిళ అలియాస్ కొప్పే (41), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన జోరిగే నాగరాజు అలియాస్ రామక్రష్ణ అలియాస్ కమలేష్‌తోపాటు ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్లు మడకం మీనా, సురేశ్ సలాం ఉండగా వీరందరిపై కోటి ముప్పై లక్షల రివార్డు ఉన్నట్లు డిఐజి సుందర్ రాజ్ వెల్లడించారు .వీరి తర్వాత పీఎల్‌జీఏ, కంపెనీ 6కు చెందిన ఆరుగురు సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు ముగ్గురిని ఇప్పటి వరకు గుర్తించారు. పోరంకి గ్రామానికి చెందిన నాగరాజు ఐటిఐ చదివి అడువుల్లోకి వెళ్ళారు. ఈ ఘటనలో ఎల్‌ఎంజీ 1, ఏకే 47 4, ఎస్‌ఎల్‌ఆర్ – 6, ఇన్సాస్ -3, 303 రైఫిళ్లు 2తో పాటు దేశీయంగా తయారైన తుపాకులు లభించాయని డిఐజి వెల్లడించారు.

చత్తీస్‌గఢ్ అభూజ్‌మాడ్ ఎన్‌కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులు ఎవరు ఎంత మంది ? అనే దానిపై ఎన్‌కౌంటర్ జరిగి కొన్ని గంటలు గడిచినా పూర్తి స్పష్టత రాలేదు. మృతదేహాలను అభూజ్‌మాడ్ నుంచి దంతేవాడ, నారాయణపూర్‌కు తరలించినా ఇంకా అగ్రనేతలే ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. నంబళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు తదితర అగ్రనేతలు ఉన్నట్టుగా పౌరహక్కుల సంఘం నేతలు అనుమానిస్తున్నారు.కాని వారు సురక్షితంగానే ఉన్నట్లు మరో వాదన విన్పిస్తుంది. 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిల్లో 28 మ్రతదేహాలు దంతేవాడకు, 9 మృతదేహాలను నారాయణపూర్‌కు తరలించారు.

మృతుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతలే చనిపోయినట్టుగా సందేహిస్తున్నారు. అయితే వారెవరు అనేదే ఉత్కంఠగా మారుతోంది. పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలను, ఆయుధాలను కూడా పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ ఎన్‌కౌంటర్‌లో కొందరు కీలక నేతలకు సైతం బుల్లెట్ గాయాలు అయినట్టు తెలుస్తోంది. అలా గాయపడిన మావోయిస్టు లు ఎక్కడికి వెళ్లారు? ఎటు వెళ్లారు? ఘటనా స్థలం నుం చి ఎంత దూరం వెళ్లారు? వారేమయ్యారు? సజీవంగా పోలీసులకు ఎవరైనా చిక్కారా? అనేది సస్పెన్స్ గా మారింది. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం.. అభూజ్‌మాడ్ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో ఘటనా స్థలంలో మావోయిస్టులు దాదాపు 40 నుంచి 50 మంది ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ 40 నుంచి 50 మంది ఉన్నట్టయితే.. మిగతా వారు ఏమయ్యారు? గాయపడ్డారా? పారిపోయారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే చర్చల్లో ఉన్నాయి ఈస్ట్ బస్తర్ డివిజన్, పి ఎల్ జిఏ కంపెనీ 6, ఇంద్రావతి ఏరియా కమిటీ, ప్లాటూన్ 16 కి చెందిన అగ్ర నక్సలైట్లు మోర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సూర్ కోవెల్ నందూరి తులతులి ( అభూజ్‌మాడ్) అటవీ ప్రాంతంలో సమావేశం అయినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దంతెవాడ డి ఆర్ జి, నారాయణపూర్ డిఆర్ జి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బ్రందం బయలుదేరారు.

శుక్రవారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో నెందూర్-తులతులి అటవీ ప్రాం తంలో ఇరువురు మధ్య ప్రారంభమైన ఎదురుకాల్పులు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి.అనంతరం ఎన్కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకు న్న పోలీసు బలగాలు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఉబ్బిన నది కాలువలు మాడ్ కొండలను దాటి వెళ్ళీ అభూజ్‌మాడ్ నక్సలైట్ల కోటపై పెద్ద విజయం సాధించినట్లయింది .గాయపడిన ఒక సైనికుడు రాయ్‌పూర్‌లో చికిత్స పొ ందుతున్నాడు, సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు.స్వాధీనం చేసుకున్న 31 మృతదేహాల తోపాటు సామాగ్రిని దంతవాడ ఎస్పీ కార్యాలయానికి తరలించి అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టిన పోలీసులు ఎన్కౌంటర్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు యువ ఐపి ఎస్ అధికారులు ప్రభాత్ కుమార్ , గౌరవ్ రాయ్ నాయకత్వంలో అభూజ్‌మాడ్ అటవీ ప్రా ంతం లో పోలీసులు జయకేతం ఎగురవేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటి ఇతర కమిటీల కీలకనేతలంతా ఇక్కడే తలదాచుకుంటారు.అలాంటి అబుజ్ మడ్ పై పోలీసులు పట్టుసాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News