Saturday, January 18, 2025

సర్ ప్రైజ్.. దీపావళి కానుకగా నిఖిల్ కొత్తం సినిమా

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నిఖిల్‌ తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఉన్నట్టుండి తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అయితే, ఈ సినిమా ఎప్పుడు ప్రకటించారు, షూటింగ్ ఎప్పుడు పూర్తి చేశారు అని అభిమానులు షాకవుతున్నారు. ఎస్వీసీసీ పతాకంపై నిర్మించిన ఈ మూవీకి సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

ఈ మూవీకి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రుక్మిణీ వసంత్‌, దివ్యాంశ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు. అయితే, దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూట్‌ జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్‌ కృష్ణమాచారి రూపొందిస్తున్నాడు. సంయుక్త, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News