Sunday, October 6, 2024

శిల్పకళా వేదికలో ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో సిఎం ప్రసంగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాలకొద్దీ సాగదీసిందని, నోటిఫికేషన్ దశలోనే కొన్నేళ్లపాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1635 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలు పొందినవారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.

90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసే విధంగా చేశామన్నారు రేవంత్ రెడ్డి. వందేళ్ల అనుభవం ఒకవైపు ఉంటే…పదేళ్ల దుర్మార్గం మరో వైపు ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం అనే ముసుగులో కెసిఆర్ ఎన్నో ఏళ్లు గౌరవం పొందారన్నారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. 2014లో బిఆర్ఎస్ ఖాతాలో ఉన్నదెంత? ఇప్పుడున్నదెంత? అని నిలదీశారు. బిఆర్ఎస్ ఖాతాలోకి వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News