Sunday, October 6, 2024

భోపాల్ ఫ్యాక్టరీలో రూ.1800 కోట్లకు పైగా డ్రగ్స్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ శివార్లలో ఒక ఫ్యాక్టరీలో నుంచి రూ. 1814 కోట్లు విలువ చేసే మెఫెడ్రోన్ (ఎండి) డ్రగ్‌ను, దాని ముడి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు, ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు. భోపాల్ సమీపంలోని బాగ్రోడా పారిశ్రామిక వాడలో గల ఫ్యాక్టరీలో గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్), ఢిల్లీ మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్‌సిబి) సంయుక్తంగా నిర్వహించిన దాడి, సోదా కార్యక్రమంలో ఘన. ద్రవ రూపాల్లో 907.09 కిల్లో మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. గుజరాత్ ఎటిఎస్ గుట్టు రట్టు చేసిన అతిపెద్ద అక్రమ ఫ్యాక్టరీ ఇదే. ఆ యూనిట్‌కు రోజుకు 25 కిలోల ఎండిని ఉత్పత్తి చేయగల సామర్థం ఉందని ఎటిఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాము దాడి జరిపినప్పుడు భారీ పరిమాణంలో డ్రగ్ తయారీ ప్రక్రియ సాగుతోందని ఎటిఎస్ ఆ ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 1814.18 కోట్లు విలువ చేసే 907.09 కిలోల మెఫెడ్రోన్‌ను ఘన, ద్రవ రూపాల్లో అధికారులు ఆ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నారని ఎటిఎస్ తెలియజేసింది. దాడిలో ఇద్దరు వ్యక్తులు అమిత్ చతుర్వేది (57), సన్యాల్ ప్రకాశ్ బనె (40)లను అరెస్టు చేసినట్లు ఎటిఎస్ తెలిపింది. 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో ఒక ఎండి డ్రగ్ స్వాధీనం కేసులో బనె అరెస్టయి, జైలులో ఐదు సంవత్సరాలు గడిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ‘తన విడుదల తరువాత అతను గణనీయంగా ఆర్థిక లాభాలు ఆర్జించేందుకు ఎండిని అక్రమంగా తయారుచేసి విక్రయించేందుకు సహ నిందితుడు చతుర్వేదితో కుమ్మక్కయ్యాడు, భోపాల్ శివార్లలో ఒక ఫ్యాక్టరీని అద్దెకు తీసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు’ అని ఎటిఎస్ వివరించింది. వారు ఆరేడు నెలల క్రితం ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారని ఎటిఎస్ తెలిపింది.

మూడు నాలుగు నెలల క్రితం వారు ముడి వస్తువులు, పరికరాలు సేకరించి ఎండి తయారీని, విక్రయాన్ని ప్రారంభించారని ఎటిఎస్ తెలిపింది. దాడి చేసినప్పుడు నిషిద్ధ డ్రగ్‌తో పాటు గ్రైండర్లు, మోటార్లు, గ్లాస్ ఫ్లాస్క్‌లు, హీటర్లు, ఇతర సాధనాలు సహా ఎండి తయారీకి ఉపయోగించే రసాయనాలతో సహా సుమారు 5000 కిల్లో ముడి వస్తువులను కనుగొన్నట్లు ఎటిఎస్ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News