Sunday, October 6, 2024

మహిళను హత్య చేసిన నిందితురాలు అరెస్టు

- Advertisement -
- Advertisement -

కూకట్ పల్లి ప్రియాంక అనే మహిళను హత్య చేసిన నిందితురాలు మంజులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ జోన్ డిసిపి సురేష్ కుమార్ అదనాపూర్ డిసిపి సత్యనారాయణ లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక అనే మహిళ వ్యభిచారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఇదే వృత్తిలో ఉన్న మంజుల ఎల్లంబండా ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ వ్యభిచారం వృత్తి కొనసాగిస్తుంది. ఇదే సమయంలో ఇద్దరు మధ్య స్నేహం ఏర్పడి ప్రియాంక దగ్గర ఉన్న చెవి పోగులు, వెండి ఆభరణాలు మంజుల దగ్గర దాచి పెట్టింది. గత నెల 30వ తేదీన తన బంగారు వెండి వస్తువులు ఇవ్వాలని మంజులను కోరగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ప్రియాంక తనకు తెలిసిన వారితో మంజులను బెదిరించి బంగారు చెవిపోగులు వెండి అభరణాలను తీసుకున్నది.

దీంతో ప్రియాంకతో తనకు ప్రాణమని ఉన్నదని గుర్తించిన మంజుల ప్రియాంకను తన ఇంటికి తీసుకువెళ్లి బాగా మద్యం తాగించి అనంతరం ప్రియాంక స్కూటీ పైన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోధా అపార్ట్ మెంట్ ముందున్న ఉదాశీన్ మటం ఖాళీ స్థలంలో చెత్తకుప్పలో పడవేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం మంజుల నేరం తన మీదికి రాకుండా ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేశారని నమ్మించడానికి ప్రియాంక బట్టలు మొత్తం చింపి మరియు ప్రియాంక యోని పై భాగంలో మొత్తం ఓపెన్ చేసి పెట్టి వెళ్లిపోయినట్లు నిందితురాలు మంజుల అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు మంజూలను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం తనే చేసినట్లు అంగీకరించింది. దీంతో మంజులను అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు బాలానగర్ జోన్ డిసిపి సురేష్ కుమార్ చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి సత్యనారాయణ, కూకట్ పల్లి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ముత్తు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News