- Advertisement -
రాష్ట్రంలో నాలుగురోజుల పాటు తేలిక పాటినుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5నుండి 5.8 కిమి మధ్యలో కొనసాగుతున్నట్టు తెలిపింది. మరోవైపున ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ ,దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి రాయలసీమ వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మి ఎత్తులో కొనసాగుతున్నట్టు తెలిపింది. సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ , పెద్దపల్లి, మెడ్చెల్ మల్కాజిగిరి ,వికారాబాద్ ,సంగారెడ్డి ,మెదక్ , కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
- Advertisement -