Friday, November 22, 2024

మావోయిస్టుల సమస్యపై నేడు కీలక సమీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సోమవారం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు హాజరుకానున్నారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చలు జరగనున్నాయి. త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చత్తీస్‌గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా నిర్వహించే ఈ సమావేశానికి ఉభయ రాష్ట్రాల మంత్రులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ హాజరుకానున్నారు.ఈ సమీక్ష సమావేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News