Tuesday, April 1, 2025

ఇలా అయితే తినట్టే.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

సామాన్య జనాలకు కూరగాయల ధరలు షాకిస్తున్నాయి.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇందులో ముఖ్యంగా టమాటా కొండెక్కి కూర్చుంది. మార్కెట్‌లో టమాటా ధర రూ.100 పలుకుంది. హోల్‌సేల్ మార్కెట్లు, మండీలలో టమాటా రూ.80 నుంచి రూ.90 వరకు ఉంది.

ఇక, ఉల్లిగడ్డ ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో ఉల్లి ధర రూ.80కి చేరింది. అలాగే, కిలో బెండకాయలు రూ.70, బీన్స్ రూ.100, దొండ రూ.60, క్యాప్సికం రూ.80, బీరకాయ రూ.70 చొప్పున మార్కెట్లలో విక్రయిస్తున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్య ప్రజలు మాత్రం.. కూరగాయల ధరలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News