Sunday, December 22, 2024

రజనీకాంత్ పై దర్శకుడు కెఎస్. రవికుమార్ ఆరోపణలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దర్శకుడు కెఎస్. రవికుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఆరోపణలు  చేశారు. తమ కలయికలో వచ్చిన ‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్నారని ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

‘‘ఎడిటింగ్ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఏ మాత్రం సమయం ఇవ్వకుండా సెకండాఫ్ మొత్తాన్ని మార్చేశారు. అనుష్కతో ఉండే పాట, క్లైమాక్స్ ట్విస్ట్ తొలగించేశారు. కృత్రిమంగా బెలూన్ జంపింగ్ సీన్ పెట్టారు. ‘లింగ’ సినిమా అంతా గందరగోళం చేశారు’’ అని రవికుమార్ వాపోయారు.

‘లింగ’ యాక్షన్ కామెడీ చిత్రంగా 2014లో తెరకెక్కింది. అందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 150 కోట్లకు పైగా రాబట్టింది.  వసూళ్లు అయితే బాగానే రాబట్టినప్పటికీ సినిమా పరాజయం పొందిందనే చెప్పాలి.

Linga 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News