Monday, October 7, 2024

ఏరోనాటిక్స్ క్లస్టర్ ను అభివృద్ది చేయనున్న భారత్, ప్రాన్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఏరోస్పేస్ రంగంలో తమ సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నందున… ఏరోనాటిక్స్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని ఫ్రాన్స్, భారత్ యోచిస్తున్నాయని భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ సోమవారం తెలిపారు.

దేశ రాజధానిలో ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (GIFAS) నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య భాగస్వామ్యం కేవలం వ్యూహాత్మకమైనది కాదు, విశ్వవ్యాప్తమైనది. భారతదేశం , ఫ్రాన్స్ దీర్ఘకాల భాగస్వామ్యం కలిగి ఉన్నాయన్నారు. ఫ్రాన్స్, భారత్ ఏరోనాటిక్ క్లస్టర్ అభివృద్ధి చేయనున్నాయి. అంతేకాక ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ కోసం ఇండో-ఫ్రెంచ్ క్యాంపస్ ను కూడా అభివృద్ధి చేయనున్నాయి.

రవాణాను డీకార్బోనైజ్ చేయడంతోపాటు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్)ను అభివృద్ధి చేయడంలో భారత్ లక్ష్యానికి ఫ్రాన్స్ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News