Monday, October 7, 2024

వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి

- Advertisement -
- Advertisement -

స్టాక్ హోమ్: వైద్య శాస్త్రంలో చేసిన అసాధారణ పరిశోధనకు గాను ఇద్దరు అమెరికా డాక్టర్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రమైన ‘మైక్రో ఆర్ఎన్ఏ’ పాత్రపై వారిరువురు చేసిన పరిశోధనకు గాను వారీ అవార్డు పొందారు.

నోబెల్ అసెంబ్లీ వారి ఆవిష్కరణ “ఆర్గనిజమ్స్ ఎలా అభివృద్ధి చెందుతాయి,ఎలా పనిచేస్తాయి అనేదాన్ని ప్రాథమికంగా నిరూపించబడ్డాయి” అని పేర్కొంది.

వైద్య శాస్త్రంలో ఇప్పటి వరకు 227 మంది నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న జరిగే వేడుకల్లో నోబెల్ బహుమతితో పాటు , లక్ష డాలర్లను అందజేస్తారు. ఈ వారమంతా నోబెల్ ప్రైజ్ ల ప్రకటన కొనసాగుతుంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, సాహిత్యం, ఆర్థిక రంగాలకు నోబెల్ ప్రైజ్ లను ప్రకటించనున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News