Monday, October 7, 2024

ఆర్ జి కర్ కేస్: సంజయ్ రాయ్ పై సిబిఐ అభియోగపత్రం

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: ఆర్ జి కర్ ఆసుపత్రిలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసులో సిబిఐ సంజయ్ రాయ్ పై అభియోగపత్రం దాఖలు చేసింది. ఆగస్టు 9న ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్ ని బలాత్కరించి, హత్య చేసినట్లు అభియోగం మోపింది.  కోల్ కతాలోని ప్రత్యేక కోర్టులో ఈ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. స్థానిక పోలీసులకు సివిక్ వాలంటీర్ గా సంజయ్ రాయ్ పనిచేస్తున్నాడని పేర్కొంది. అభియోగ పత్రంలో ఎక్కడ సామూహిక బలాత్కారం అన్నది పేర్కొనలేదు. రాయ్ ఒక్కడే బలాత్కరించినట్లు పేర్కొన్నారు.

పోస్ట్ మార్టం నివేదికలో బాధితురాలు హత్యాచారానికి గురైందని పేర్కొన్నారు. ఆమె శరీరంపై 25 గాయాలున్నట్లు అటోప్సీ వెల్లడించింది. సెమినార్ రూమ్ లోకి సంజయ్ రాయ్ వెళ్లడం, అరగంట తర్వాత బయటికి రావడం సిసిటివి ఫుటేజ్ లో రికార్డయింది. సంజయ్ రాయ్ ని లైడిటెక్టర్ తో పరీక్షించినప్పుడు తాను నిర్దోషినని అతడన్నాడు. తాను ఆ గదిలోకి చేరే సమయానికి ఆమె స్పృహ తప్పి పడి ఉన్నట్లు తెలిపాడు. తనని కేసులో ఇరికించారని కూడా సంజయ్ రాయ్ పేర్కొన్నాడు. సిబిఐ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ను కూడా అరెస్టు చేసింది. సాక్ష్యాలను చెరిపేసాడని పేర్కొంది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడంది. ఓ స్థానిక పోలీస్ అధికారిని కూడా సిబిఐ అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News