Monday, October 7, 2024

బాక్సాఫీసు వద్ద రూ. 451 కోట్లు కుమ్మేసినా…సినిమా ఫ్లాప్!

- Advertisement -
- Advertisement -

పైగా ఐమాక్స్ టెక్నాలజీ వాడిన తొలి భారతీయ సినిమా

హైదరాబాద్: ఓ సినిమా విజయం అన్నది బాక్సాఫీసు వద్ద పెద్ద ఎత్తున రాబడి పొందినంత మాత్రాన రాదు. 2019 విడుదలైన అలాంటి సినిమా గురించి మాట్లాడుదాం. అదో మెగా బడ్జెట్ సినిమా. బాక్సాఫీసు వద్ద రూ. 451 కోట్లు రాబట్టింది. అయినా అపజయం పొందిన సినిమా అయింది. నిర్మాతలు ఓ సింగిల్  స్క్రీన్ లో దాన్ని నిలబెట్టడానికి రూ. 70 కోట్లు కూడా ఖర్చు చేశారు. కానీ అపజయం నుంచి కాపాడలేకపోయారు.

ఆ సినిమా సుజీత్ దర్శకత్వం వహించిన ‘సాహో’. ఆ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్ నటించారు. దానిని రూ. 350 కోట్లు పెట్టి నిర్మించారు. అందులో ఓ 8 నిమిషాల సీను కోసం రూ. 70 కోట్లు కూడా ఖర్చుపెట్టారట. ఆ సినిమాకు అయినంత ఖర్చు ఇప్పటికీ ఏ సినిమాకు కాలేదు. ఆ సినిమా వల్ల పంపిణీదారులకు రూ. 52 కోట్లు నష్టం వాటిల్లింది. సాహో సినిమా హిందీలో అయితే హిట్ అయింది కానీ తమిళ్, మలయాళంలో ఫెయిల్ అయింది. ఓపెనింగ్ రోజున రూ. 60 కోట్లు రాబట్టినా, చివరికి నష్టంతో ముగిసింది.

సాహో సినిమాలో ఐమాక్స్ కెమెరా, టెక్నాలజీ ఉపయోగించారు.  పైగా 100 స్టంట్ పర్ఫామర్స్ ను వాడారు ఓ యాక్షన్ సీన్ కోసం. ఈ సినిమా బాక్సాఫీసులో రూ. 451 కోట్లు రాబట్టినప్పటికీ, సినిమా తయారీకే రూ. 350 కోట్లు కావడంతో ఈ సినిమా ఫెయిల్ కిందే లెక్కించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News