- Advertisement -
పాకిస్తాన్‌లో అత్యంత రద్దీగా ఉండే కరాచీ విమానాశ్రయం వద్ద చైనా కార్మికులను లక్షంగా చేసుకుని తీవ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు చైనా జాతీయులు మరణించగా మరో 17 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో తీవ్రవాదిగా అనుమానిస్తున్న ఒక పాక్ జాతీయుడు కూడా మరణించాడు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో రెండు వారాలలో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సదస్సుకు ముందు ఈ ఘటన జరగడం ప్రాధాన్యతను సంతరించకున్నది. ఒక విద్యుత్ కంపెనీకి చైనా సిబ్బంది వెళుతున్న కాన్వాయ్‌పై ఈ డాది జరిగింది. ఆత్మాహుతి దాడి కోసం ఒక చిన్న వాహనాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
- Advertisement -