Tuesday, October 8, 2024

రష్యా చమురు కేంద్రంపై ఉక్రెయిన్ దాడి

- Advertisement -
- Advertisement -

రష్యా చమురు స్థావరంపై ఉక్రెయిన్ బలగాలు దాడికి దిగాయి. ఇది కీలక పరిణామమని, యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రధాన ఘట్టానికి చేరుకుందని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ సోమవారం ప్రకటించారు. రష్యా జరిపే దాడులకు పెద్ద ఎత్తున ఇంధనం అందించే ప్రధాన క్రిమియా ఆయిల్ టర్మినల్‌పై దాడికి దిగామని తమ సైనిక వర్గాలు పేర్కొన్న విషయాన్ని జెలెన్‌స్కీ తమ ప్రకటనలో ప్రస్తావించారు. ఇప్పుడు రష్యా బలగాలకు ఇంధన సంక్షోభం ఏర్పడుతుందని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియా సింధుశాఖ ప్రాంతంలో అత్యంత విలువైన చమురు నిక్షేపాలు ఉన్న ఫియోడోసియాలోని చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ దాడులు జరపడం రెండేళ్లుగా సాగుతూ వస్తున్న ఇరుదేశాల నడుమ ఘర్షణలో కీలక పరిణామం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News