Sunday, November 24, 2024

జగద్గిరిగుట్టలో కిడ్నాప్.. కృష్ణా నదిలో హత్య

- Advertisement -
- Advertisement -

ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉండేందుకు ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్ప డి మెగా ఇంజనీరింగ్ ఏజిఎంను కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి నదిలో పడేసి హత మార్చారని మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి తెలిపారు. సోమవారం బాలానగర్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఇన్‌ఛార్జి డిసిపి కోటిరెడ్డి నింధితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు అయిన వెంకట అప్పన్న రెడ్డి (55) అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు అతని అదృశ్యం పై ఆరా తీశారు. కేసు దార్యాప్తులో భాగంగా కిడ్నాప్ ఎండ్ మర్డర్ జరిగినట్లు గుర్తించారు. ఆల్విన్ కాలనీ వాసి వెంకటప్పన్న రెడ్డి మెఘా ఇంజనీరింగ్‌లో ఏజిఎంగా పనిచేస్తున్నాడు.

దీంతో పాటు కాకినాడ షిప్‌యార్డ్‌లో గతంలో బిజినెస్ చేసేవాడు. ఆ సమయంలో ద్వారక నాథ్ రెడ్డి అనే వ్యక్తి తో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది. వ్యాపార ఆర్థిక లావాదేవీలలో భాగంగా ద్వారాకనాథ్ రెడ్డి 28 లక్షలు ఇవ్వా ల్సి ఉండగా పలుమార్లు అడగడంతో చెక్కులు ఇచ్చాడు. ఇచ్చిన చెక్కులు బౌ న్స్ అవడంతో ద్వారకనాధ్ రెడ్డిని వెంకటప్పన్న రెడ్డి గట్టిగా నిలాదీశాడు. దీంతో ఈ నెల 6వ తేదిన ఎలాగైనా డబ్బులు ఇచ్చేస్తానని అగ్రిమెంట్ చేశాడు. కానీ డబ్బులు ఇవ్వకుండా ద్వారకనాథ్ రెడ్డి కనిపించకుండా తిరుగుతున్నా డు దీంతో వెంకటప్పన్న రెడ్డి ద్వారాక రెడ్డి ఇంటికి వెళ్లి కూడా డబ్బుల విషయంలో గొడవ పడ్డాడు. ఇది మనసులో పెట్టుకున్న ద్వారక నాథ్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా ఉండాలని భావించి 5 మంది వ్యక్తులతో కిడ్నాప్ చేయడానికి మాట్లాడుకున్నాడు. కడప జిల్లాకు చెందిన ఐదుగురు నిందితులు సుధాకర్ రెడ్డి, పాశం ప్రసాద్, కిరణ్ కుమార్, గడ్డం వెంకటసుబ్బయ్య, మణికంఠ వైఎస్‌ఆర్ కడప జిల్లా వాసులు, వీరంతా కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

పలుమార్లు పక్కా రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేయాలని స్కెచ్ వేశారు. వెంకటప్పన్న రెడ్డి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడ్డగించి మత్తు ఇచ్చి డిచ్‌పల్లి వద్ద కృష్ణ నదిలో కాళ్లు చేతులు కట్టి వెంకటప్పన్న రెడ్డిని నదిలో పడేశారు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం కృష్ణానదిలో కొట్టుకుపోయిన మృతదేహం జగద్గిరిగుట్ట పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్, సిసి కెమెరాల దర్యాప్తు ఆధారంగా, మహబూబ్ నగర్ పోలీసుల సహకారంతో గుర్తించామని డిసిపి కోటిరెడ్డి వెల్లడించారు. ఈ కేసులో 100 సిసి కెమెరాలు, ఇతర టెక్నికల్ ఏవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేసి నింధితులు A1 ద్వారాక రెడ్డి పరారీలో ఉండగా మిగితా ఐదు మంది నిందితులను సోమవారం అరెస్ట్ చేసి నింధితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. వీరంతా డబ్బు ఆశతోటే ఈ దారుణానికి ఒడిగట్టారని, పోలీసుల దర్యాప్తులో తేలినట్లు డిసిపి కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసు చేదించడంలో ప్రతిభ కనబరిచిన జగద్గిరిగుట్ట సిఐ క్రాంతి కుమార్‌తో పాటు, సిబ్బందిని సైబరాబాద్ సిపి అభినందించినట్లు డిసిపి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News