మన తెలంగాణ/సిటీ బ్యూరో/నాంపల్లి: నగరంలో ఎంఐఎం, కాంగ్రెస్ వర్గాల నాయకుల మధ్య ఏర్పడిన వివాదం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వ ర కు వెళ్లింది. ఇరు వర్గాలు ఒకే ప్రాంతానికి రావడంతో రాళ్లతో దాడులకు పాల్పడడంతో ఉద్రిక్తత పరిస్థితి నె లకొంది. నాంపల్లి నియోజకవర్గంలోని ఓ కాలనీలో కొత్తగా సిసి రోడ్డు వేస్తున్నారు. దీని కోసం తీసిన గుం తులో ఓ వృద్ధుడు పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన వృద్ధుడు కాంగ్రెస్ నాయకుడు, నాంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్‌కు వృద్ధుడు విషయం చెప్పాడు. దీంతో ఫిర్‌జ్ ఖాన్ సిసి రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతానికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అక్కడికి తన అనుచరులతో రావడంతో ఒక్కసారిగా ఉద్రికత్తత వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు ఎదురుపడడంతో దాడులు చేసుకున్నారు,
ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ తన అనుచరులతో ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేశారు. ఇరు పార్టీల నాయకులు రాళ్లతో దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్‌పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు వెంటనే చేరుకుని దాడులను అడ్డుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో ఆ స్టేషన్ పోలీసులు వచ్చి గొడవను ఆపివేశారు. దాడి చేసేందుకు యత్నించి వారిని అడ్డుకుని అక్కడి నుంచి పం పించివేశారు. పోలీసులు సరైన సమయంలో రావడంతో దాడిని అడ్డుకున్నారు. దాడిపై ఇప్పటి వరకు పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రోడ్డు వివాదంలో ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో మల్లేపల్లి, మె హిదీపట్నం రోడ్డు రాకపోకలు బందయ్యాయి. గొడవ వల్ల రోడ్డుపై రాకపోకలు మొత్తం బందయ్యాయి. ఎంఐఎం కార్యకర్తలు మళ్లీదాడులు చే సే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.