Tuesday, October 8, 2024

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని దీపా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దీపా కర్మాకర్ పేర్కొంది. రిటైర్మెంట్ అనేది చాలా కష్టంతో కూడుకున్న నిర్ణయమని దీన్ని తీసుకోవడం అనుకున్నంత తేలిక కాదని అభిప్రాయపడింది. జిమ్నాస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావించి నిర్ణయాన్ని తీసుకున్నట్టు వివరించింది. ఇక భారత జిమ్నాస్ట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత ఒక్క దీపాకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీపా అసాధారణ ఆటతో జిమ్నాస్టిక్స్ రారాణిగా పేరు తెచ్చుకుంది.

2011 జాతీయ క్రీడల్లో దీపా ఏకంగా నాలుగు స్వర్ణాలు గెలవడంతో దేశ వ్యాప్తంగా ఆమె పేరు మారుమ్రోగి పోయింది. అంతేగాక 2014 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య గెలిచి సంచలనం సృష్టించింది. దీంతో పాటు ప్రపంచ జిమ్నాస్టిక్స్, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మరోవైపు 2016 ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఒలింపిక్స్‌లో దీపా నాటుగో స్థానంలో నిలిచింది. కాగా, దీపాను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది అమ్మాయులు జిమ్నాస్టిక్స్‌లో చేరారు. ప్రస్తుతం దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన జిమ్నాస్ట్‌లు తయారయ్యారంటే దానికి ప్రధాన కారణం దీపానే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News