Saturday, November 23, 2024

ధవళగిరిపై నుంచి జారి ఐదుగురు రష్యన్ పర్వతారోహకులు మృతి

- Advertisement -
- Advertisement -

7000 మీటర్ల ఎత్తులో మృతదేహాలు లభ్యం
ఖాట్మండు : ధవళగిరి పర్వతంపై జాడ తెలియకుండా పోయిన ఐదుగురు రష్యన్ పర్వతారోహకుల మృతదేహాలు మంగళవారం ఏడు వేల మీటర్ల ఎత్తులో కనిపించాయి. అన్వేషణ, రక్షణ కార్యక్రమంలో పాల్గొన్న హెలి ఎవరెస్ట్ వైస్ చైర్మన్ మింగ్మా షెర్పా సమాచారం ప్రకారం, నేపాల్ శరదృతువులో ఆదివారం ప్రపంచంలోని ఏడవ ఎత్తైన ధవళగిరి పర్వత శిఖరం చేరుకోవాలని ఆ ఐదుగురు రష్యన్ పర్వతారోహకులు లక్షం పెట్టుకున్నారు.

శిఖరాగ్రం చేరుకునే యత్నంలో ఉదయం 6 గంటలకు పర్వత శిబిరం నుంచి బయలుదేరిన తరువాత బేస్ క్యాంప్‌తో వారు సంబంధాలు కోల్పోయారు. వారంతా ఒకే తాడు సాయంతో 8167 మీటర్ల శిఖరాగ్రం దిశగా సాగుతూ గల్లంతయ్యారని షెర్పా ‘పిటిఐ’తో చెప్పారు. వారి మృతదేహాలను 7700 మీటర్ల ఎత్తులో రక్షక హెలికాప్టర్ కనుగొన్నదని ఆయన తెలిపారు. అననుకూల వాతావరణం కారణంగా సోమవారం రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినట్లు నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ రాకేశ్ గురుంగ్ తెలియజేశారు. మరొక రష్యన్ పర్వతారోహకుని హెలికాప్టర్ బేస్ క్యాంప్ నుంచి రక్షించిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News