Wednesday, October 9, 2024

జానీ మాస్టర్‌కో న్యాయం….. ఎడియూరప్పకో న్యాయమా?

- Advertisement -
- Advertisement -

బిజెపిని నిలదీసిన కర్నాటక మంత్రి

బెంగళూరు: పోక్సో కేసు నమోదైన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్పపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర మంత్రి దినేష్ గుండూరావు మంగళవారం బిజెపిని ప్రశ్నించారు. పోక్సో చట్టం కింద నేరారోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ప్రదానం చేయవలసిన జాతీయ చలనచిత్ర అవార్డును సస్పెండ్ చేసి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అభినందించారు.

లైంగిక వేధింపులు లేదా అత్యాచార ఆరోపణలపై దర్యాప్తు ఎదుర్కొంటున్న వారిని సత్కరించరాదని, జానీ మాస్టర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదని ఆయన తెలిపారు. అయితే ఎడియూరప్ప విషయానికి వస్తే అదే సూత్రాన్ని బిజెపి పాటించలేదని ఆయన విమర్శించారు. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎడిచూరప్పపై బిజెపి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

ఎడియూరప్పపై సిఐడి చార్జిషీట్ దాఖలు చేసిందని, కనీసం పార్టీ కేంద్ర కమిటీ సభ్యత్వం నుంచి ఆయనను బిజెపి తొలగించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అవినీతి ఆరోపణలపై లోకాయుక్త దర్యాప్తుతోపాటు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోక్సో విచారణను ఎదుర్కొంటున్న ఎడియూరప్పను ఎందుకు ఇంకా కాపాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎడిచూరప్ప కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News