Wednesday, October 16, 2024

బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

చెరువుకు, బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉంది
బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందించాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
మనతెలంగాణ/హైదరాబాద్: బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ అని, చెరువుకు, బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉందని, బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. చెరువులను కాపాడుకుందాం, చెరువులను పరిరక్షించే బాధ్యత అధికారులపై ఉందని ఆమె అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టిజిఓ భవన్‌లో టిజిఓ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్కతో పాటు టిజిఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణలు పాల్గొని ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మనకు పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆచారం, సంస్కృతీ బతుకమ్మ అన్నారు. భవిష్యత్ తరాలకు ఈ పండుగను అందించడమే మన బాధ్యత అని, చెరువులను కబ్జాలు కాకుండా కాపాడుకుందామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ రోజు చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని, చెరువులకు పూజలు చేసే పండుగ బతుకమ్మ అని, తెలంగాణ అంటేనే చెరువులు అని, బతుకమ్మ చెరువుల్లో నీరు తాగేదని, పొలాలకు నీరు అందించేదని ఆమె తెలిపారు. మన జీవన శైలి చెరువులపై ఆధారపడి ఉందని, హైదరాబాద్‌కు లేక్ సిటీ అని పేరు ఉండేదని, కానీ, ఈ రోజు అవి కనుమరుగు అయిపోయాయని ఆమె తెలిపారు. ఆటలు, పాటలు, బతుకమ్మకు పూజలు ఇది తరతరాలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

టిఎన్జీఓ కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో

బతుకమ్మ వేడుకల్లో భాగంగా టిఎన్జీఓ కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టిఎన్జీఓ కేంద్ర సంఘం ఆవరణలో అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు , ముత్యాల సత్యనారాయణ గౌడ్, మహిళా నేతలు ఉమాదేవి, శైలజ, అనురాధ, రంగారెడ్డి అధ్యక్షులు లక్ష్మణ్, నగరాశాఖ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్ జిల్లా విక్రమ్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి, భారత్ కుమార్, కేంద్రసంఘం నేతలు నరసింహ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అరుణ్ కుమార్లు, తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, వివిధ హెచ్‌ఓడి మహిళా ఉద్యోగినులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల మహిళా ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ త్వరలో ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News