Wednesday, October 16, 2024

వర్గీకరణ చేయకుండా ఉద్యోగాల భర్తీ సరికాదు : మంద కృష్ణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హిమాయత్‌నగర్ : ఎస్సీ వర్గీకరణ,రిజర్వేషన్ చేయకుం డానే సిఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడంపై ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీని నిరసిస్తూ నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్‌పిఎస్ విద్యార్థులు,నిరుద్యోగులు నల్లబ్యాడ్జిలతో ఆయా జిల్లా కేంద్రలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల నుండి కలెక్టర్ కార్యాలయల వరకు ర్యాలీ,ధర్నా నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో కూడా ఎంఆర్‌పిఎస్ నాయకులు,విద్యార్థులు,నిరుద్యోగులతో కలిసి ట్యాంక్ బాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి బషీర్‌బాగ్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

సిఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాదిగలకు నమ్మకద్రోహం చేసిందని,మాదిగల పట్ల ముఖ్యమంత్రి ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతారని,కానీ అచరణలో మాత్రం మాలల పక్షాన నిలుస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిపిసిసి ఛీప్‌గా మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి మాలలకు ఎక్కువ సీట్లు ఇచ్చారని,శాసన సభలో 4సీట్లు తగ్గడానికి రేవంత్‌రెడ్డి కారణమని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జరుపకుండానే నేడు 11వేల టీచర్ పోస్టులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారని, దీంతో మాదిగ బిడ్డలకు 6వందల ఉద్యోగాలు కూడా రావడం లేదన్నారు. సిఎం పదవి పోకుండా కాపాడుకునేందుకు మాలల పక్షాన ఉంటూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 17న ఎంఆర్‌పిఎస్ అనుబంద సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఈ సమావశంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు గోవింద్ నరేష్,రాజు,సోమశేఖర్,విజయ్‌మాదిగ, మల్లికార్జున్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News