Tuesday, December 17, 2024

డిసెంబర్‌లో అఖండ 2 షూటింగ్ షురూ?

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో బాలయ్య, – టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య పాత్ర తాలూకు పరిచయ షాట్స్ ను తీస్తారట. మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వర్షన్‌పై కసరత్తులు చేస్తున్నారు. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మొదటి సినిమాని కూడా డిసెంబర్‌లోనే లాంచ్ చేస్తుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News