హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంతృప్తికరంగా ఉన్నారని తెలియజేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 150 మందికి మాత్రమే విదేశీ విద్యానిధి ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందన్నారు. గత పది సంవత్సరాల నుంచి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను పొన్నం ఖండించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నామని, నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు పిల్లలకు విద్యకు చర్యలు తీసుకుంటున్నామని, బిసి సంక్షేమ శాఖ, బిసి కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడుతామని పొన్నం స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తుంది: పొన్నం
- Advertisement -
- Advertisement -
- Advertisement -