Sunday, December 22, 2024

అంగన్వాడీ టీచర్ ను సాగర్ కాలువలోకి నెట్టేసి చంపిన భర్త… అరెస్టు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: అంగన్వాడీ టీచర్ గల్లంతు కేసును పోలీసులు ఛేదించారు. భార్యను కాలువలో నెట్టి ప్రమాదకరంగా భర్త చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించి అతడిని అరెస్టు చేసిన సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రావులపెంట గ్రామ శివారులో మూడు రోజుల క్రితం అంగన్వాడీ టీచర్ అనూష తన భర్త సైదులుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో గల్లంతయ్యారు. భర్త ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఆమె మృతిపై అనుమానాలు ఉండడంతో భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిందితుడు నేరం అంగీకరించాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతోనే భార్యను కాలువలోకి నెట్టి ప్రమాదకరంగా భర్త చిత్రీకరించాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు సైదులును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News