Saturday, December 21, 2024

పార్శీ గుట్ట ఎంఆర్‌పిఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్శీ గుట్ట ఎంఆర్‌పిఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్‌సి వర్గీకరణ చేయకుండా డిఎస్‌సి ఉద్యోగాల భర్తీ చేపట్టారని ఎంఆర్‌పిఎస్ నేతలు పార్శీగుట్ట నుంచి ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీ తలపెట్టారు. ఈ ర్యాలీలో ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు. ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టడంతో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఎంఆర్‌పిఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్‌సి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి వర్గీకరణ చేయకుండా డిఎస్‌సి ఉద్యోగాల భర్తీ చేపట్టారని ఎంఆర్‌పిఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎస్ సి వర్గీకరణ చేపట్టిన తరువాత ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News